Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న వెంకటేశ్

  • అనిల్ రావిపూడితో 'ఎఫ్ 2' మూవీ 
  • బాబీ దర్శకత్వంలోను ఒక సినిమా 
  • త్రినాథరావు మూవీలో సోలో హీరోగా
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వెంకటేశ్, వరుసగా రెండు మల్టీ స్టారర్ మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో .. వరుణ్ తేజ్ తో కలిసి 'ఎఫ్ 2' అనే సినిమా చేస్తున్నారు. ఇక బాబీ దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి 'వెంకీమామ' అనే సినిమాను లైన్లో పెట్టారు. ఈ రెండు సినిమాల తరువాత సోలో హీరోగా ఆయన ఒక సినిమా చేయనున్నారు.

నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా వెంకటేశ్ కనిపించనున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో వెంకటేశ్ పాత్రను తీర్చిదిద్దిన తీరు కొత్తగా ఉంటుందని అంటున్నారు. గతంలోను కొన్ని సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా వెంకటేశ్ కనిపించి మెప్పించారు. ఆ పాత్రలకి పూర్తి భిన్నంగా ఈ పాత్ర ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే పూర్తివివరాలు వెల్లడించనున్నారు.     
venkatesh
trinatha rao

More Telugu News